సీఎస్‌కే ఓటమి.. జీవా ధోనిపై అసభ్యకర వ్యాఖ్యలు..

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 పరుగులు తేడాతో ఓడిపోయినా సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమికి ధోని, కేదార్ జాదవ్ కారకులని సీఎస్‌కే ఫ్యాన్స్ విమర్శలు..

సీఎస్‌కే ఓటమి.. జీవా ధోనిపై అసభ్యకర వ్యాఖ్యలు..

Updated on: Oct 09, 2020 | 6:37 PM

CSK Lost IPL Match to KKR: భారత్‌లో క్రికెట్ అంటే ఒక ఎమోషన్. ఈ ఆటకు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లగా కొలిచే కొంతమంది ఫ్యాన్స్.. మ్యాచ్ ఓడిపోతే వారిని విమర్శిస్తూ హద్దులు దాటుతుంటారు. ఇటీవల కాలంలో అభిమానం పేరుతో కొంతమంది పిచ్చి వేషాలు వేస్తూ.. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేస్తూ హద్దులు దాటి తమ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 పరుగులు తేడాతో ఓడిపోయినా సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమికి ధోని, కేదార్ జాదవ్ కారకులని సీఎస్‌కే ఫ్యాన్స్ విమర్శలు గుప్పించడమే కాకుండా ట్రోలింగ్‌కు కూడా దిగారు. మరికొందరు అయితే వ్యక్తిగత దూషణలకు దిగి చిన్నారి జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరోసారి మ్యాచ్ ఓడిపోతే తనపై అత్యాచారం చేసేందుకు వెనకాడమని దిగజారుడు కామెంట్స్ చేశారు. కాగా, ధోనికి నిజమైన అభిమానులైతే ఇలాంటి కామెంట్స్ చేయరంటూ తలా ఫ్యాన్స్ వాళ్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: 

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

Follow Us