భారత టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీపై తానింకా ఆశలు వదులు కోలేదని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. 2018లో ఇంగ్లాండ్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అతడు ఫామ్ ను కొనసాగించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచీ అతడు భారత్ తరుపున టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన గబ్బర్ తిరిగి టెస్టుల్లో ఆడేందుకు ఇంకా ఇంట్రస్ట్ తో ఉన్నానని చెప్పాడు.
‘టెస్టు జట్టులో నేను లేనంత మాత్రాన దాన్ని లైట్ తీసుకున్నట్లు కాదు. ఛాన్స్ వచ్చినప్పుడు సత్తా చాటుతా. ఇంతకుముందు రంజీల్లో సెంచరీ చేసి వన్డేల్లోకి వచ్చినట్లే ఇప్పుడు కూడా అవకాశాలు వస్తే కచ్చితంగా వాటిని సద్వినియోగం చేసుకొని మళ్లీ టెస్టు జట్టులో చోటు సంపాదిస్తా. అందుకోసం విశ్వప్రయత్నం చేస్తా.ఇప్పుడైతే నా టార్గెట్ వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్. దాని కోసం హార్డ్ వర్క్ చేయాలి. ఫిట్‌గా ఉండాలి. నిలకడైన ఫామ్ తో రాణించాలి. ఇవన్నీ చేస్తే మిగతావన్నీ వాటంతటవే జరిగిపోతాయి’ అని ధావన్ పేర్కొన్నాడు.
Also Read :
గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !