గబ్బర్ చేసిన పనికి పడవ నడిపిన వ్యక్తిపై జిల్లా అధికారుల చర్యలు.. ఆంక్షలు అతిక్రమించాడంటూ వార్నింగ్ నోటీస్

|

Jan 25, 2021 | 7:40 AM

భారత క్రికెటర్ గబ్బర్ శిఖర్ ధావన్​ చేసిన పనికి ఓ పడవ నడిపే జాలరిపై వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్​ రాజ్ శర్మ చర్యలు తీసుకోనున్నారు. అయితే ధావన్​ చేసిందల్లా కొన్ని పక్షులకు ఆహారం

గబ్బర్ చేసిన పనికి పడవ నడిపిన వ్యక్తిపై జిల్లా అధికారుల చర్యలు.. ఆంక్షలు అతిక్రమించాడంటూ వార్నింగ్ నోటీస్
Follow us on

Dhawan Bird Flu Controversy : భారత క్రికెటర్ గబ్బర్ శిఖర్ ధావన్​ చేసిన పనికి ఓ పడవ నడిపే జాలరిపై వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్​ రాజ్ శర్మ చర్యలు తీసుకోనున్నారు. అయితే ధావన్​ చేసిందల్లా కొన్ని పక్షులకు ఆహారం అందించడమే. ధావన్​ఇటీవల వారణాసి పర్యటనకు వెళ్లి.. కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అందులో పక్షులకు ఆహారం తినిపిస్తూ కనిపించిన గబ్బర్.. ఆ పని ఎంతో సంతోషాన్నిచ్చిందని క్యాప్షన్​ పెట్టాడు. అయితే ఇప్పుడు అదే ఫొటో వారణాసిలో అతడు పయనించిన పడవ నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి కారణంగా మారింది.

కొద్ది రోజులుగా పలు రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పక్షులకు ఎలాంటి ఆహారం అందించరాదని వారణాసిలో ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ధావన్​ చర్య పడవ నడిపే వ్యక్తిపై శిక్షగా మారింది. పడవలు నడిపేవారికి మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం… పర్యాటకులను పక్షులకు ఆహారం అందించకుండా చూడమని చెప్పామని కలెక్టర్ తెలిపారు. ఉత్తర్వులు పాటించానివారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వారి లైసెన్స్​ను ఎందుకు రద్దు చేయకూడదో తెలిపాని అన్నారు. సాధారణంగా పర్యాటకులను ఇలాంటి విషయాలపై అవగాహన ఉండదు కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.