Dhanurmasam mahotsavam: విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఘనంగా ధనుర్మాస మహోత్సవాలు..

Dhanurmasam mahotsavam: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో ధునుర్మాస మహోత్సవాలు..

Dhanurmasam mahotsavam: విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఘనంగా ధనుర్మాస మహోత్సవాలు..

Updated on: Jan 07, 2021 | 10:47 AM

Dhanurmasam mahotsavam: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో ధునుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి, త్రిదండి అహోబిల జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహోత్సవాలకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. 23వ రోజు మహోత్సవాల్లో భాగంగా గోదా అష్టోత్తరంతో కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. గోదా అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు.. చిన్న జీయర్ స్వామి భక్త బృందం గోదా అమ్మవారికి సారె సమర్పించారు. కాగా, ధనుర్మాసం ప్రారంభమైన డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ మహోత్సవాలను విజయకీలాద్రిపై నిర్వహిస్తున్నారు.

Also read:

Covid Vaccine Alert: కరోనా వ్యాక్సిన్‌ కావాలా అంటూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా..? అయితే జాగ్రత్తగా ఉండండి..

Pawan Kalyan-Rana Movie : పవన్-రానా మూవీ షూటింగ్ అప్‌డేట్.. సినిమా కోసం భారీ లాడ్జి సెటప్