జేఎన్‌యూ మాజీ విద్యార్థి “షర్జీల్ ఇమామ్‌”పై ఛార్జిషీట్..!

| Edited By:

Apr 18, 2020 | 7:17 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ.. హింసను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశాడన్న ఆరోపణలపై జేఎన్‌యూ మాజీ స్టూడెంట్‌ షర్జీల్ ఇమామ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేశారు. జామియా ఇస్లామియాలో అల్లర్లు ప్రోత్సహించాడమే కాకుండా.. దేశద్రోహ స్పీచ్‌లు ఇచ్చాడంటూ షర్జిల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 13వ తేదీన షర్జీల్ ఇమామ్‌.. తన ప్రసంగాలతో అల్లర్లను ప్రోత్సహించేలా రెచ్చగోట్టారని.. ఈ ఏడాది జనవరి 28న బీహార్‌ రాష్ట్రంలోని జహ్నాబాద్‌లో ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 13వ […]

జేఎన్‌యూ మాజీ విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై ఛార్జిషీట్..!
Follow us on

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ.. హింసను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశాడన్న ఆరోపణలపై జేఎన్‌యూ మాజీ స్టూడెంట్‌ షర్జీల్ ఇమామ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేశారు. జామియా ఇస్లామియాలో అల్లర్లు ప్రోత్సహించాడమే కాకుండా.. దేశద్రోహ స్పీచ్‌లు ఇచ్చాడంటూ షర్జిల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 13వ తేదీన షర్జీల్ ఇమామ్‌.. తన ప్రసంగాలతో అల్లర్లను ప్రోత్సహించేలా రెచ్చగోట్టారని.. ఈ ఏడాది జనవరి 28న బీహార్‌ రాష్ట్రంలోని జహ్నాబాద్‌లో ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

డిసెంబర్ 13వ తేదీన షర్జీల్ ప్రసంగాలు చేసిన రెండు రోజుల తర్వాత.. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. పౌర సత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. జామియా నగర ప్రాంతంతో పాటుగా.. న్యూఫ్రెండ్ కాలనీలో ప్రదర్శనలు చేపట్టారు. ఆ సమయంలో జామియా స్టూడెంట్స్‌ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్ఫణల్లో అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. అంతేకాదు.. రోడ్డుపై ఉన్న ప్రభుత్వ, ప్రవేట్‌ ప్రాపర్టీలను ధ్వంసం చేయడంతో పాటు.. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలకు సంబంధించి.. రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ సీఏఏ వ్యతిరేక అల్లర్లలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాదు.. సామాన్య ప్రజానీకం కూడా గాయపడ్డారు. కాగా.. దేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల పెద్ద ఎత్తున అల్లర్లు జరగడమే కాకుండా.. పలు చోట్ల ప్రాణానష్టం కూడా సంభవించింది.