ఢిల్లీలో తగ్గిన కోవిడ్ 19 ఉధృతి, తక్షణమే మెడికల్ కళాశాలల రీఓపెనింగ్ కి అనుమతి, స్కూళ్ళు ఇప్పుడే కాదు

ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల ఉధృతి తగ్గడంతో తక్షణమే మెడికల్ కళాశాలలను మళ్ళీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విద్యార్థులు..

ఢిల్లీలో తగ్గిన కోవిడ్ 19 ఉధృతి, తక్షణమే మెడికల్ కళాశాలల రీఓపెనింగ్ కి అనుమతి, స్కూళ్ళు ఇప్పుడే కాదు

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2021 | 6:27 PM

ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల ఉధృతి తగ్గడంతో తక్షణమే మెడికల్ కళాశాలలను మళ్ళీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విద్యార్థులు, అధ్యాపకులు అంతా కోవిడ్ మార్గదర్శక సూత్రాలను పాటించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఫైనల్ ఇయర్  విద్యార్థులు జయప్రదంగా శిక్షణ ముగించుకున్న అనంతరం తుది సంవత్సర వార్షిక పరీక్షలకు హాజరు కావచ్చునని, ఆ తరువాత సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్.. బీడీఎస్ విద్యార్థులు తిరిగి కాలేజీల్లో చేరవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. కాగా- ఫ్రంట్ లైన్ వర్కర్లు, ప్రజలందరి వ్యాక్సినేషన్ అనంతరం మాత్రమే స్కూళ్లను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియా వెల్లడించారు.  బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా ఎంత త్వరగా ఈ విద్యా  సంస్థలను తిరిగి ప్రారంభించాలన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

మొత్తానికి వైద్య విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం  చేస్తున్నారు.

Also Read:

National News: భారత్‏లో ఇదే ‘నిద్రపోని నగరం’.. అక్కడ 24 గంటలు షాప్స్ ఓపెన్.. అదేంటో తెలుసా ?..

మేఘా ఇంజినీరింగ్ సామాజిక బాధ్యత, అత్యున్నత సౌకర్యాలతో నిమ్స్‌లో నిర్మించిన ఆంకాలజీ బ్లాక్ 9న ప్రారంభం

Bird Sickness: పక్షుల అనారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ పర్యావరణ శాఖ అధికారులు .. లేదంటే తీవ్ర పరిణామాలు..