పాంటింగ్ పాఠాలు.. నెట్స్‌లో శ్రమిస్తున్న పంత్..

|

Sep 16, 2020 | 6:29 PM

ఐపీఎల్ 2020 సందడి మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది.

పాంటింగ్ పాఠాలు.. నెట్స్‌లో శ్రమిస్తున్న పంత్..
Follow us on

Delhi Capitals Rishabh Pant: ఐపీఎల్ 2020 సందడి మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్ళు ప్రాక్టీస్ సెషన్లలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు కోచ్ పాంటింగ్ సారధ్యంలో నెట్స్‌లోకి చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో పంత్ భారీ సిక్సర్లు, షాట్లు ఆడుతుండగా.. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.