Krunal Pandya: బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యాపై.. ఆ జట్టు వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అకారణంగా కృనాల్ తనపై నోరు పారేసుకున్నాడని.. టీం సభ్యులు ముందు దుర్భాషలాడాడని పేర్కొంటూ బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ లెలెకు ఓ లేఖ రాశాడు. తాను బరోడా జట్టు తరపున 11 ఏళ్లుగా ఆడుతున్నానని.. ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని హుడా లేఖలో వివరించాడు.
టీం సభ్యులు ముందు కృనాల్ తనని అసభ్యకరంగా తిట్టడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగాడని దీపక్ హుడా చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల కారణంగా తాను మానసిక ఒత్తడికి గురయ్యాయని.. టోర్నీ నుంచి వైదొలిగినట్లు లేఖలో హుడా పేర్కొన్నాడు. కాగా, ఇప్పటిదాకా ఏడు ఐపీఎల్ సీజన్లు ఆడానని.. ఎప్పుడూ ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణం చూడలేదని దీపక్ హుడా తెలిపాడు.