Daylight saving time In United States : గత ఆదివారం మధ్యరాత్రి మొదలైన డే లైట్ సేవింగ్ టైం ఇక నుండి ఇలాగే ఉంటుందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గడియారంలో సమయాన్ని మార్చడం ద్వారా అమెరికాలో చాలామందికి ఆరోగ్య సమస్యలు వొస్తున్నాయని, ప్రత్యేకించి హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తీర్మానాలు చేసి ఫెడరల్ ప్రభుత్వానికి సమర్పించారు. సెనెట్లో ఈ తీర్మానం పైన పలు దఫాలుగా చర్చలూ జరిగిన నేపథ్యంలో ఈ సారి అమెరికా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అటు అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలు సైతం టైం చేంజ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, చాలామంది మాత్రం ఇదే శాశ్వత టైంగా ఉంచితేనే బెటరంటున్నారు. ఇందుకు సరైన కారణాలు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రతీ ఏడాదిలో తాము మూడో వంతు మాత్రమే ప్రామాణిక సమయంలో గడుపుతున్నామని చెప్పుకొస్తున్నారు. అయితే,, ఎప్పుడూ సాయంత్రం వెలుతురులో ఎక్కువ సేపు పనిచేస్తే, లేట్ మార్కింగ్స్ సంగతేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ అంతటా ప్రతి ఏడాదీ సాంప్రదాయంగా వస్తోన్న, “పగటి పొదుపు సమయాన్ని” శాశ్వత సమయంగా మార్చడానికి ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. అన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ దీనినే పర్మినెంట్ టైంగా ఉంచమంటున్నారు అమెరికన్లు. ఇప్పటికే, 15 రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పగటి ఆదా సమయాన్ని శాశ్వత సమయంగా మార్చడానికి ఒక చట్టాన్ని కూడా ఆమోదించాయి. సూర్యకాంతిలో ఎక్కువసేపు గడిపేందుకు ఇది వెసులు బాటుగా ఉంటుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, డే టైం ఎక్కువగా ఉంటడం వల్ల సమయం ఆదా అవుతుందని, పని పరిమాణం బాగా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. శీతాకాలపు చలి నార్త్ స్టేట్స్ లో తగ్గుముఖం పట్టడంతో, వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ మంది ప్రజలు బయట ఉంటారు. కాబట్టి నేరాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. వీధుల్లో ట్రాఫిక్ ఎక్కువగానే కొనసాగడం వల్ల ప్రజలు మరింత సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
వీటన్నిటికంటే ముఖ్యంగా అంతకు మించి, గడియారంలోని సమయాలు మారడం వల్ల దుష్ప్రభావాలు చాలా ఉన్నాయని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి టైమ్ జోన్‌ను ఒక గంట ముందుకు కదిలించడం వల్ల శీతాకాలంలో చాలా ఆలస్యమైన సూర్యోదయాలకు కారణమవుతుందని సూచిస్తున్నప్పటికీ, తామంతా మంచిగా ఉండవచ్చు అనే భావనను వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరంలో మూడింట రెండు వంతుల పగటి సమయాన్ని, దానిలో మూడింట ఒక వంతుకు ప్రామాణిక సమయాన్ని ఉపయోగించడం ద్వారా సమయం చాలా వరకూ ఫలప్రదంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, సమయాల్లో మార్పులు చేయడం వల్ల కారు ప్రమాదాలు పెరుగుతాయని, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయని అంతేకాక, నిద్ర అలవాట్లపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని అంటున్నారు. ఇలాంటి దుష్ప్రభావాలన్నింటికీ సమయం మార్పులు కారణమవుతున్నాయని చెప్పుకొస్తున్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ సమయం మార్పులకు చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉంది. పగటి సమయం ఎక్కువగా ఉపయోగించుకునేందుకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ టైం చేంజ్ విధానాన్ని అవలంభించారు. తద్వారా ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపుగా ఉండేందుకు ఈ సమయం మార్పుల విధానం అవలంభించారు. అంతేకాదు, పగటి పూట ఎక్కువ గంటలు ఇవ్వడం ద్వారా పంట సీజన్లలో ఈ పద్ధతి రైతుల అవసరాలను తీరుస్తుందనేది కూడా ఒక కారణం.
ఇక, సమయం మార్పుకు సంబంధించి 2008లో యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ విశ్లేషకులు జరిపిన పరిశోధన ప్రకారం పగటి సమయం ఆదా చేయడం వల్ల ప్రతి రోజు విద్యుత్ వినియోగాన్ని 0.5 శాతం తగ్గిస్తుందని తేల్చారు. పైగా, గడియారాలు సర్దుబాటు చేయడం ద్వారా ప్రతి వసంతకాలంలో దారిదోపిడీ రేట్లు కూడా గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. ఇలా పగటి సమయం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల భద్రత కూడా పెంచుతుందని ఆ నివేదికలో సూచించారు.
Read also :