పోలీసులు – మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఘటన స్థలంలో ఆయుధాలు స్వాధీనం

|

Dec 28, 2020 | 8:20 PM

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో కాల్పుల మోత మోగింది. మావోలు సంచరించే ఈ ప్రాంతాన్ని పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలీసు బలగాలు మావోల పక్కా సమాచారం తెలుసుకుని మట్టుబెడుతున్నారు. తాజాగా దంతేవాడ..

పోలీసులు - మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఘటన స్థలంలో ఆయుధాలు స్వాధీనం
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో కాల్పుల మోత మోగింది. మావోలు సంచరించే ఈ ప్రాంతాన్ని పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలీసు బలగాలు మావోల పక్కా సమాచారం తెలుసుకుని మట్టుబెడుతున్నారు. తాజాగా దంతేవాడ జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు.. మావోయిస్టులకు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాలేపాల్‌, పేరేఖాక్రి ప్రాంతంలో హోరాహోరీగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు.. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసు బలగాలు అనునిత్యం అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ను అడ్డాగా మార్చుకున్న మావోయిస్టులు ఇప్పటికే ఎన్నో విధ్వంసాలకు పాల్పడుతూనే ఉన్నాయి.  దీంతో పోలీసులు కూడా అనునిత్యం గాలిస్తూనే ఉన్నారు.