ఆయుర్వేద ఔషధం.. ‘ఆస్థా-15’ సామర్థ్యంపై క్లినికల్‌ ట్రయల్స్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో కరోనా చికిత్స కోసం తాము రూపొందించిన

ఆయుర్వేద ఔషధం.. ఆస్థా-15 సామర్థ్యంపై క్లినికల్‌ ట్రయల్స్..

Updated on: Jun 05, 2020 | 4:55 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో కరోనా చికిత్స కోసం తాము రూపొందించిన పాలీహెర్బల్‌ కాంబినేషన్‌ ‘ఆస్థా-15’ ఔషధ సామర్థ్యం, భద్రతను అంచనా వేయడానికి క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్‌ వెల్లడించింది. మల్టీ-సెంట్రిక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్ని నియంత్రణ మార్గదర్శకాలు అనుసరిస్తామని దాల్మియా గ్రూపు తెలిపింది.

కరోనా పేషెంట్లకు సహాయపడే.. మా అత్యంత సమర్థ ఆయుర్వేదిక్‌ సమ్మేళనం క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించామ’ని దాల్మియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ సంజయ్‌ దాల్మియా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఔషధాన్ని ఇప్పటికే చెన్నైలోని ప్రత్యేక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులపై పరీక్షించి అధ్యయనం చేశారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కరోనా చికిత్సకు ఈ ఔషధం తోడ్పడిందని అధ్యయనంలో తేలినట్లు సంస్థ పేర్కొంది.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us