భల్లాల దేవుడి పెళ్లి ముచ్చటగా సాగింది. పెళ్లికి రెడీ అవడంతో కరోనా వచ్చి పడింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్… లాక్ డౌన్ ముగిసిందని అనుకునేంతలో కరోనా ఆంక్షలు. ఇలా ఎట్టకేలకు రానా దగ్గుబాటి వివాహం వైభవంగా జరిగింది.
దగ్గుబాటి రానా ఆగస్ట్ 8న తన ప్రేయసి మిహికా మెడలో మూడు ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే. కరోనా వలన వివాహ వేడుకకు కొద్ది మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఇలా రాలేనివారి కోసం రానా స్పెషల్ వర్చువల్ వెడ్డింగ్ కార్డులను బంధు మిత్రులకు అందించారు. ఇలా వారంతా ఇంట్లోనే ఉండి వర్చువల్ రియాల్టీలో వివాహ వేడుకని వీక్షించారు. అయితే పెళ్లికి రాని వారి కోసం దగ్గుబాటి ఫ్యామిలీ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింది.
మా పెద్ద కుమారుడి వివాహానికి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయాం. మీ ఆశీర్వాదాలు వారికి కావాలంటూ ఓ లేఖతో పాటు గిఫ్ట్ ఉన్న కిట్‌ని బహుమానంగా అందించారట దగ్గుబాటి సురేష్ బాబు. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.