నివర్ తుఫాన్ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది మిగిల్చిన బీభత్సం అంతా ఇంతా కాదు.. వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది.. దీని ప్రభావంతో 24 గంటలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంటోంది.. దీని నుంచి ఎలాగో అలాగా బయటపడతామనుకుంటే రాబోయే రోజులలో ఏర్పడే మరో మూడు తుఫాన్లు భయపెడుతున్నాయి.. ఆదివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్సు ఉందని హెచ్చరించింది. అలాగే డిసెంబర్ మాసంలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వివరించింది. డిసెంబర్ రెండో తేదీన ఏర్పడే బురేవి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై ఎక్కవ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ అయిదున మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం టకేటి తుఫాను మారే ఛాన్సు ఉందని చెబుతోంది.. ఈ తుఫానుల గండాలను అధికారులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.