Cyber Crime In Karnataka: రోజూవారీ కూలీ చేస్తేనే గానీ ఇల్లు గడవని ఓ సామాన్యుడికి అనూహ్యంగా ఒక్క ఫోన్ కాల్‌తో 80 కోట్లు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అతడు సంతోషపడ్డాడు. అయితే కోట్ల వ్యవహారం కావడంతో ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగారు. దీంతో గుట్టు అంతా రట్టయింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలు దానికి సంబంధించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ బీడీ కాలనీకి చెందిన సయ్యద్ మల్లిక్ 2015లో ఆమె భార్య రెహానా బానో పేరిట జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేశాడు. అకౌంట్ అయితే తెరిచాడు కానీ.. ఆ దంపతులు ఇద్దరూ కూడా దాన్ని పెద్దగా ఉపయోగించడం లేదు. ఇదిలా ఉండగా అనూహ్యంగా గతేడాది డిసెంబర్‌లో ‘మీ భార్య అకౌంట్‌లో కోట్ల రూపాయలు నగదు డిపాజిట్ అయింది. ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయలేదు. కాబట్టి వెంటనే చేసుకోండి’ అని ఫోన్‌లో బ్యాంక్ అధికారులు చెప్పడంతో అతడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు.
తన భార్య ఖాతాలోకి కోట్ల రూపాయలు డిపాజిట్ కావడం ఏంటని ఒకసారి ఏటీఎంకు వెళ్లి స్టేట్‌మెంట్ చెక్ చేశాడు. అందులో రూ.80 కోట్లు ఉన్నట్లు చూపించడంతో సయ్యద్ నిర్ఘాంతపోయాడు. అంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని బ్యాంక్‌కు వెళ్లి అధికారులు చుట్టూ తిరిగాడు. కానీ ఎవరూ కూడా స్పందించలేదు. దీనితో అనుమానపడిన అతడు సరాసరి ఆదాయ పన్ను అధికారుల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఫిర్యాదు చేశాడు. ఇక ఐటీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. డిసెంబర్ చివరి వారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సయ్యద్ భార్య అకౌంట్‌లోకి లాటరీ వచ్చిందని నమ్మించి రూ.80 కోట్లు డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అంతేకాక ఆమె తెలియకుండానే కొన్ని ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు కూడా తెలుసుకున్నారు. ఈ భారీ స్కాంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉన్నట్లు ప్రాధమిక విచారణలో కూడా గుర్తించారు. మొత్తం కూపీలాగా ఆ బ్యాంక్ ఉన్నతాధికారుల హస్తంతో ఇదంతా జరిగిందని తెలుసుకున్నారు.