రూ.2000 నోట్ల ముద్రణపై ఆర్బీఐ సంచలన నివేదిక

|

Aug 25, 2020 | 4:06 PM

గత ఏడాది రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించలేదని పేర్కొంది. 2019-2020 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు అంశాలపై క్లారిటీ ఇచ్చింది. 2019-20 సంవత్సరంలో రూ.2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ముద్రించలేదని వార్షిక నివేదికలో తెలిపింది....

రూ.2000 నోట్ల ముద్రణపై ఆర్బీఐ సంచలన నివేదిక
2000 Note
Follow us on

మరో సంచలన విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గత ఏడాది రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించలేదని పేర్కొంది. 2019-2020 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు అంశాలపై క్లారిటీ ఇచ్చింది. 2019-20 సంవత్సరంలో రూ.2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ముద్రించలేదని వార్షిక నివేదికలో తెలిపింది.

గత కొన్నేండ్లుగా 2వేల నోట్ల సర్క్యులేషన్‌ తగ్గిందని పేర్కొంది. చెలామణిలో ఉన్న 2వేల విలువైన కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షలు ఉండగా 2019 మార్చి చివరికి 32,910 లక్షలకు, 2020 మార్చి ఆఖరికి 27,398 లక్షల నోట్లకు తగ్గిందని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది.

దేశంలో 2018 మార్చి నుంచి రూ. 2 వేల నోట్లు సర్క్యులేషన్‌ క్రమంగా తగ్గుతూ వస్తున్నది. మరోవైపు రూ. 500, రూ. 200 విలువైన కరెన్సీ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ గణనీయంగా పెంచడంతో మార్కెట్లో వీటి సర్క్యులేషన్‌ పెరిగింది. 2018 నుంచి మూడేళ్లలో వీటి విలువ, నోట్ల సంఖ్య పెరిగింది.