IPL 2020: RCB vs CSK : ఆర్సీబీ సూపర్ విక్టరీ, మరోసారి నిరాశపరిచిన ధోని సేన

|

Oct 10, 2020 | 11:48 PM

ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు మరోసారి నిరాశపరిచింది. ఈ సారి భారి పరాజయాన్ని మూటగట్టుకుంది.

IPL 2020: RCB vs CSK : ఆర్సీబీ సూపర్ విక్టరీ, మరోసారి నిరాశపరిచిన ధోని సేన
Follow us on

ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు మరోసారి నిరాశపరిచింది. ఈ సారి భారి పరాజయాన్ని మూటగట్టుకుంది. అద్బుతమైన ప్లేయర్లతో నిండి ఉన్న ఈ జట్టుకు ఈ సీజన్‌లో ఏమైందో అర్థం కావట్లేదు. బెంగళూరు బౌలర్ల దెబ్బకి చెన్నైై బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరారు. 170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 132/8కే పోరాటం ముగించింది. దీంతో ఏకంగా 37 పరుగుల తేడాతో చెన్నై చిత్తుగా ఓడింది. అంబటి రాయుడు (42; 40 బంతుల్లో 4×4), జగదీశన్‌ (33; 28 బంతుల్లో 4×4) పోరాడకపోతే ఓటమి ఇంకా దారుణంగా ఉండేది. మరోవైపు కోహ్లీసేన నాలుగో విజయంతో 8 పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ప్లేఆఫ్‌కు రేసులో నిలిచింది. అంతకు ముందు బెంగళూరులో విరాట్ కోహ్లీ (90*; 52 బంతుల్లో 4×4, 4×6) అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో మోరిస్‌ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌కు రెండు వికెట్లు లభించాయి. ఉదాన,చహల్‌కు చెరో వికెట్‌ దక్కింది.

కాగా చెన్నై బౌలర్ల  దెబ్బకు మొదట్లో విలవిల్లాడిపోయిన బెంగళూరు 120- 130 స్కోరు చేస్తే ఘనం అనుకున్నారు అంతా. 16 ఓవర్లకు 103/4తో ఉన్న బెంగళూరును.. 20 ఓవర్లకు 169/4తో పటిష్ఠ స్థితికి చేర్చాడు కెప్టెన్ కోహ్లీ. చివరి ఐదు ఓవర్లలో శివమ్‌ దూబె (22*; 14 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి 74 రన్స్ సాధించాడు. దేవదత్‌ పడిక్కల్‌ (33; 34 బంతుల్లో 2×4, 1×6) కూడా రాణించాడు.  చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించగా, సామ్‌ కరాన్‌, దీపక్‌ చాహర్‌లకు తలో వికెట్‌ లభించింది.