దారుణంః యువతిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి కట్టాడు!

|

Feb 06, 2020 | 9:05 PM

Crime In Karnataka: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానిక బస్టాప్‌లో ఓ యువతి బస్సు కోసం ఎదురు చూస్తుండగా.. కొందరు దుండగులు కారులో ఆమెను అపహరించుకుపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. కారులోకి ఆమెను కిడ్నాప్ చేయడమే కాకుండా వారిలో ఒకరు బలవంతంగా తాళి కట్టాడు. ఇక సదరు యువతికి వరుస బావ అయిన మను అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. యువతి తన ప్రేమను […]

దారుణంః యువతిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి కట్టాడు!
Follow us on

Crime In Karnataka: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానిక బస్టాప్‌లో ఓ యువతి బస్సు కోసం ఎదురు చూస్తుండగా.. కొందరు దుండగులు కారులో ఆమెను అపహరించుకుపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. కారులోకి ఆమెను కిడ్నాప్ చేయడమే కాకుండా వారిలో ఒకరు బలవంతంగా తాళి కట్టాడు. ఇక సదరు యువతికి వరుస బావ అయిన మను అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

యువతి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో కిడ్నాప్ చేసిన మను.. ఆమె వదిలేయమని బ్రతిమాలిన వినకుండా బలవంతంగా వేరొకరి సహాయంతో తాళి కట్టాడు. కాగా, మను తన ఫ్రెండ్స్ సహకారంతో యువతిని దాచిపెట్టినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.