ఈ బుడతడి హిట్టింగ్ చూశారా…

|

Sep 14, 2020 | 6:31 PM

టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఓ బుడతడి వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. బిల్డింగ్‌ స్టెప్స్‌పైనే బ్యాట్‌ పట్టుకుని ఆడుతున్న  ఈ  చిన్నోడికి కొన్ని బంతుల్ని వేస్తే భారీ హిట్టింగ్‌లతో....

ఈ బుడతడి హిట్టింగ్ చూశారా...
Follow us on

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ పండుగ మొదలు కాబోతోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఎవరి జట్ల బలం ఎంతా.. ఎవరి టీమ్ లో ఎవరున్నారు.. వారి రికార్డులు… ఇలాంటి న్యూస్ ఇప్పుడు సందడి చేస్తున్నాయి. అయితే  తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బుడతడు కొట్టే భారీ షాట్స్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఓ బుడతడి వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. బిల్డింగ్‌ స్టెప్స్‌పైనే బ్యాట్‌ పట్టుకుని ఆడుతున్న  ఈ  చిన్నోడికి కొన్ని బంతుల్ని వేస్తే భారీ హిట్టింగ్‌లతో విరుచుకుపడ్డాడు.

ఎంతో ప్రాక్టీస్ ఉన్న సీనియర్ ఆటగాడిలా ఈ చిచ్చర పిడగు హిట్టింగ్‌ చేస్తున వీడియోను నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్‌ చేసిన ఆకాశ్‌ చోప్రా.. ‘ఈ పిల్లాడు ఎంత బాగా ఆడుతున్నాడు’ అనే కామెంట్‌ చేశారు.

ఈ వీడియోను చూసినవారు తమకు నచ్చిన క్రికెటర్ల పేర్లు పెడుతున్నారు. అచ్చం క్రిస్‌ గేల్‌ను మరిపిస్తున్నాడని కొందరు అభినందించగా.. యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌ శైలిని పోలి ఉన్నాడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఆ చిన్నోడిలో బ్యాట్‌ స్వింగ్‌ అదిరిపోయిందంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలో ఓ టీ20 మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ 360 డిగ్రీస్‌ తరహాలో ఆరు సిక్సర్లు కొట్టిన జ్ఞాపకాల్ని ఈ బుడతడు గుర్తుచేశాడని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ బుడతడుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.