జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి బయటకు వస్తే బాగుంటుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. “ప్రజల కష్టాలపై పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నాడు, బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. పాచిపోయిన లడ్డులన్న పవన్ కు బీజేపీ కొత్త లడ్డులు ఏమి ఇవ్వలేదని, రాష్ట్రానికి బీజేపీ అన్ని రకాలుగా మోసం చేసిందని రామకృష్ణ అన్నారు. జనసేన పార్టీ సెక్యూలర్ పార్టీ అని, ఇప్పుడు కమ్యూనల్ పార్టీతో పొత్తులో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “పవన్ కళ్యాణ్ తేలిసో తెలియకో బీజేపీతో జతకట్టాడు, పవన్ తో మేము కలిసి పనిచేశాము. అందుకే చెప్తున్నా.. పవన్ స్వతహాగా సెక్యూలర్ భావాలున్న వ్యక్తి” అని రామకృష్ణ చెప్పారు.