ఢిల్లీ ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు.. టీకా వచ్చిన మూడు, నాలుగు వారాల్లోనే డిల్లీవాసులందరికీ వ్యాక్సిన్..!

|

Nov 28, 2020 | 7:52 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్‌‌లోనూ విజృంభణ కొనసాగుతుంది. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కొవిడ్ నుంచి విముక్తి కలిగించేందుకు తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు.. టీకా వచ్చిన మూడు, నాలుగు వారాల్లోనే డిల్లీవాసులందరికీ వ్యాక్సిన్..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్‌‌లోనూ విజృంభణ కొనసాగుతుంది. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కొవిడ్ నుంచి విముక్తి కలిగించేందుకు తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే, కరోనా వ్యాక్సిన్ వినియోగంపై ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత లభ్యతను బట్టి మూడు, నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులంద‌రికీ అంద‌జేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. పాలీక్లినిక్ వంటి ఆరోగ్య సౌకర్యాల సాయంతో మొత్తం ఢిల్లీలోని జనాభా అందరికీ త్వరితగతిన వాక్సిన్ వేయడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. వాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా అనుకున్న సమయంలోనే అందరికీ అందిస్తామన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. మరోవైపు కొత్తగా పెరగుతున్న పాజిటివ్ కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.