Covid Vaccine Second Dose:28 రోజుల అనంతరం శనివారం దేశ వ్యాప్తంగా హెల్త్ కేర్ సిబ్బందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 న ప్రారంభమైంది. నేడు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ హెడ్ వి.కె. పాల్ టీకామందు తీసుకోనున్నారు. శుక్రవారం వరకు 77 లక్షల మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు మొదటి డోసును తీసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 97 శాతం మంది తాము వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సంతృప్తిగానే ఉన్నామని, ఎలాంటి శారీరక సమస్యలు లేవని ప్రకటించినట్టు ఈ శాఖ తెలిపింది. జులై నాటికీ దేశంలో 30 కోట్లమందికి టీకామందు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 26 రోజుల్లో 70 లక్షల మందికి వ్యాక్సిన్ ఇఛ్చిన దేశంగా ఇండియా మొదటిస్థానంలో నిలవగా.. అమెరికాకు ఈ వ్యవధి 27 రోజులు, బ్రిటన్ కు 48 రోజులు పట్టింది. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవారీగా వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలు ఇలా ఉన్నాయి.
77.66 lakh Beneficiaries Vaccinated against #COVID19.
2,61,309 beneficiaries vaccinated till 6 pm today.
No New Death has been reported in last 24 hours.https://t.co/zMko5GbehQ pic.twitter.com/Y2z3KkOtiM
— Ministry of Health (@MoHFW_INDIA) February 12, 2021
8 లక్షల మందితో యూపీ అత్యధిక వ్యాక్సిన్లు ఇచ్చిన రాష్ట్రంగా నిలవగా ఆ తరువాత మహారాష్ట్ర 6,33,519, గుజరాత్ 6,61,508 తో వరుసగా రెండు , మూడు స్థానాల్లో ఉన్నాయి. బీహార్ లో 79 శాతం మంది హెల్త్ కేర్ వర్కర్లు టీకామందు తీసుకున్నారు. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 40 శాతం కన్నా తక్కువ మందికి వ్యాక్సిన్ ఇఛ్చినట్టు వెల్లడైంది. పుదుచ్చేరి అయితే మరీ తక్కువగా..17.5 శాతంతో వెనుకబడి ఉంది.
Also Read:
India Corona: కరోనాతో గత 24 గంటల్లో 103 మంది మృతి.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?