ఏపీ బులిటెన్: 16 లక్షలకు చేరువలో కోవిడ్ పరీక్షలు..

|

Jul 26, 2020 | 8:56 AM

కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 16 లక్షలకు చేరువలో ఉంది.

ఏపీ బులిటెన్: 16 లక్షలకు చేరువలో కోవిడ్ పరీక్షలు..
Follow us on

Covid 19 Tests In Andhra Pradesh: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 16 లక్షలకు చేరువలో ఉంది. కేవలం వారం రోజుల్లోనే 3,11,290 పరీక్షలు జరగ్గా.. ఇందులో కంటైన్మెంట్ జోన్లలోనే అధికంగా పరీక్షలు నిర్వహించారు. ఇక గడిచిన 24 గంటల్లో 53,681 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పరీక్షల సంఖ్య 15,95,674కి చేరింది. కాగా ఏపీలో ప్రస్తుతం 88,671 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 44,431 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 43,255 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ కారణంగా 985 మంది మరణించారు.

రాష్ట్రంలో కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి..

  • ఇన్ఫెక్షన్‌ రేటు  –  5.56%
  • రికవరీ రేటు –  48.78%
  • మరణాల రేటు –  1.11%

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే పేదలకు సులభంగా లోన్స్..