
కరోనా నుంచి దేశాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ..కొన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులకు తప్పట్లేదు. పట్టెడు కూడు పెట్టే మనిషి లేక, ఆకలిని తట్టుకోలేక కొంతమంది చిన్నారులు కప్పలను ఆహారంగా సేవిస్తున్నారు. హృదయాలను కలిచివేసే ఈ ఘటన బీహార్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ కొంతమంది వలస కార్మికులకు, పేద వర్గాలకు పూట గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో జెహనాబాద్‌కు చెందిన కొందరు చిన్నారులు ఆకలితో అల్లాడిపోయారు. ఐదు రోజులుగా ఆహారం దొరక్కపోవడంతో.. కప్పలను తింటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు. మురుగు కాలువలో ఉన్న కప్పలను వేటాడటం వాటికి ఇప్పుడు అవసరం మాత్రమే కాదు జీవన్మరణ సమస్యగా మారింది.
ఇది గమనించిన కొందు ఎందుకు కప్పలను తింటున్నారని..ఆ చిన్నారులను ప్రశ్నించగా…ఆహారం తినక
ఐదు రోజులవుతుందంటూ వారి ప్రస్తుత బ్రతుకు చిత్రాన్ని వివరించారు. ఇంట్లో వండటానికి ఏమి లేవని, ప్రస్తుతం ఆహారం దొరకడం అసాధ్యంగా మారిందని వెల్లడించారు. అందుకే చేసేది లేక ఇలా కప్పలను తింటున్నామని తమ విషాద గాథ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది. దీని గురించి సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
#बिहार के जहानाबाद में छोटे छोटे बच्चे पेट की आग बुझाने के लिए मेढक खाकर खाने को मजबूर @NitishKumar @yadavtejashwi #BiharFightsCorona #lockdown #migrantworkers @amitabhojha pic.twitter.com/kkjz2uJlK0
— Corona Warrior News24 India (@news24tvchannel) April 19, 2020