Covaxin Vaccine: దేశంలోని పలు నగరాలకు చేరుకున్న కోవాగ్జిన్‌ టీకా.. విరాళంగా 16 లక్షలకు పైగా డోసులు..

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 7:38 AM

Covaxin Vaccine Distribution: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశ వ్యాప్తంగా కృషి చేసిన కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఒకటి. మొదటి నుంచి కచ్చితమైన..

Covaxin Vaccine: దేశంలోని పలు నగరాలకు చేరుకున్న కోవాగ్జిన్‌ టీకా.. విరాళంగా 16 లక్షలకు పైగా డోసులు..
Follow us on

Covaxin Vaccine Distribution: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశ వ్యాప్తంగా కృషి చేసిన కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఒకటి. మొదటి నుంచి కచ్చితమైన ఫలితాలతో దూసుకెళ్లిన ఈ కంపెనీ ఇటీవల తమ వ్యాక్సిన్‌కు అనుమతులు పొందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవిడ్‌-19 కోవాగ్జిన్‌ టీకాను భారత్‌లోని 11 నగరాలకు చేర్చారు. ఈ విషయాన్ని భారత్‌ బయోటిక్‌ కంపెనీ తెలిపింది. ఇక ప్రభుత్వానికి సుమారు 16.5 లక్షల డోసుల వ్యాక్సిన్లను విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించింది. ఇక ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న టీకా పంపిణీ కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం భారత్‌ బయోటిక్‌ కంపెనీ నుంచి 55 లక్షల డోసుల కోవాగ్జిన్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతగా హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం, గువహటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణే, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నో నగరాలకు బుధవారం టీకాలను సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే.. నిర్వీర్యం చేసిన సార్స్‌–కోవ్‌2 వైరస్‌తో తయారు చేసిన కోవాగ్జిన్ దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో తయారైన తొలి టీకా కావడం విశేషం.

Also Read: Covid Vaccine: లబ్ధిదారులకు ఆ అవకాశం లేదు.. టీకా కేంద్రంలో ఏది ఉంటే అదే వేయించుకోవాలి.. స్పష్టం చేసిన కేంద్రం..