Covaxin Effectively Neutralises UK Covid Strain: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశీయంగా భారత్ బయోటిక్ తయారు చేసిన ‘కొవాగ్జిన్’ కూడా మంచి ఫలితాలను ఇస్తోంది.
ఈ క్రమంలోనే కొవాగ్జిన్ ఇప్పటికే భారత దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా తమ వ్యాక్సిన్ విషయమై భారత్ బయోటిక్ కీలక ప్రకటన చేసింది. తాము రూపొందించిన కొవాగ్జిన్ బ్రిటన్ వేదికగా పుట్టుకొచ్చిన కొత్త రకం స్ర్టెయిన్ వైరస్‌పై కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని కంపెనీ అధికారికంగా తెలిపింది. బుధవారం భారత్ బయోటిక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. కోవిడ్-19 కంటే 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు భావిస్తున్న బ్రిటన్ కొత్త వైరస్‌ను తమ వ్యాక్సిన్ నిలువరిస్తోందని తెలిపింది. ఈ ట్వీట్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్ర్తవేత్తలు నిర్వహించిన పరిశోధనల లింక్‌ను భారత్ బయోటిక్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
Neutralization of UK-variant VUI-202012/01 with COVAXIN vaccinated human serum https://t.co/v8Me4TzGgh #BharatBiotech #COVAXIN #bioRxiv #COVID19 pic.twitter.com/7R3FlsWAX3
— BharatBiotech (@BharatBiotech) January 27, 2021