దేశంలో కరోనా విలయం.. ఒక్క రోజే 52,9720 కేసులు, 771 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 52,9720 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 771 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా విలయం.. ఒక్క రోజే 52,9720 కేసులు, 771 మరణాలు..

Updated on: Aug 03, 2020 | 1:58 PM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 52,9720 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 771 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,696కి చేరుకుంది. ఇందులో 5,79,357 యాక్టివ్ కేసులు ఉండగా.. 38,135 మంది కరోనాతో మరణించారు. అటు 11,86,203 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఢిల్లీ తప్పితే మిగిలిన అన్నింటిలోనూ రోజుకు 5 వేలుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 65.77 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 2.11 శాతంలో ఉంది.

Also Read:

కొత్త లక్షణం: కరోనా సోకినవారిలో వినికిడి లోపం.!

జగన్ సంచలన నిర్ణయం.. నాలుగు జోన్లుగా ఏపీ విభజన.!

కరోనా పేషెంట్ల వెంట స్మార్ట్ ఫోన్లు.. కేంద్రం కీలక సూచనలు.!

Loading...
Unable to load recommendations.
Follow Us