బయోకాన్ లిమిటెడ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ కి కరోనా

పద్మశ్రీ, పద్మ భూషణ్ పుర‌స్కార గ్ర‌హీత కిరణ్ మజుందార్ షా కరోనా బారిన ప‌డ్డారు. బయోకాన్ లిమిటెడ్ చైర్ పర్సన్ అయిన కిరణ్ మజుందార్ ఒక ట్వీట్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

బయోకాన్ లిమిటెడ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ కి కరోనా

Updated on: Aug 18, 2020 | 2:20 PM

దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. అన్ని వర్గాల వారిని మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా పద్మశ్రీ, పద్మ భూషణ్ పుర‌స్కార గ్ర‌హీత కిరణ్ మజుందార్ షా కరోనా బారిన ప‌డ్డారు. బయోకాన్ లిమిటెడ్ చైర్ పర్సన్ అయిన కిరణ్ మజుందార్ ఒక ట్వీట్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. త‌న కరోనా రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌న‌కు తేలికపాటి క‌రోనా లక్షణాలున్నాయ‌ని దీంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. కిరణ్ మజుందార్ షా ఒక మహిళా పారిశ్రామికవేత్తగా పేరుగాంచారు. ఆమె బయోకాన్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీని ప్రారంభించారు. కాగా, క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో రష్యా ప్రపంచంలోనే మొదటిది కాద‌ని కిరణ్ మజుందార్ షా ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. ర‌ష్యా తొలి సేఫ్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆమె త‌ప్పుపట్టారు. దశల వారిగా ట్రయల్స్ నిర్వహించకుండానే ప్రయోగం విజయవంతం అవుతుందని ప్రశ్నించారు కిరణ్ షా. అలాగే, ఆమోద యోగ్యం కాని వ్యాక్సిన్ లాంచ్ చేయడం రష్యాకే పరిమితం కావాలన్నారు.