మనిషి నుంచే కరోనా వైరస్.. జంతువుల నుంచి కాదట !

| Edited By: Anil kumar poka

May 17, 2020 | 3:40 PM

చైనాలోని వూహాన్ లో గల జంతు మార్కెట్ నుంచి కరోనా వైరస్ పుట్టిందన్న చైనా వాదనను బయాలజిస్టులు తోసిపుచ్చారు. తమకు లభ్యమైన డేటాను బట్టి.. ఇదివరకే ఈ రోగం సోకిన వ్యక్తి నుంచి ఇది వూహాన్ మార్కెట్...

మనిషి నుంచే కరోనా వైరస్.. జంతువుల నుంచి కాదట !
Follow us on

చైనాలోని వూహాన్ లో గల జంతు మార్కెట్ నుంచి కరోనా వైరస్ పుట్టిందన్న చైనా వాదనను బయాలజిస్టులు తోసిపుచ్చారు. తమకు లభ్యమైన డేటాను బట్టి.. ఇదివరకే ఈ రోగం సోకిన వ్యక్తి నుంచి ఇది వూహాన్ మార్కెట్ లో ప్రవేశించిందని  తమ స్టడీలో తేలినట్టు వారు పేర్కొన్నారు. పైగా ముందే హ్యూమన్ ట్రాన్స్ మిషన్ కి అనుగుణంగా దీన్ని ఎడాప్ట్ చేశారని, ఇది తమకెంతో ఆశ్చర్యం కలిగించిందని ఈ పరిశోధకులు తెలిపారు. అసలు ఈ వైరస్ సోర్స్ (మూలం) ఎక్కడి నుంచి పుట్టిందో ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న యత్నాలను చైనా నీరుగారుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త స్టడీ మరిన్ని విశేషాలకు కేంద్ర బిందువవుతోంది. గత ఏడాది వూహాన్ సిటీలోని ఓ ల్యాబ్ లో ఈ వైరస్ జనించిందని, అంతా గొంతు చించుకుంటున్నప్పటికీ.. చైనా ప్రభుత్వం దాన్ని కప్పి పుచ్చేందుకు నానా పాట్లూ పడుతోంది. వూహాన్ మార్కెట్ లో ఈ వైరస్ క్రాస్ స్పీసీస్ ట్రాన్స్ మిషన్ జరిగిందనడానికి తాము సంపాదించిన జెనెటిక్ డేటా నిర్ధారించడం లేదని అలీనా చాన్ అనే మాలిక్యులర్ బయాలజిస్ట్ తెలిపారు. అయినప్పటికీ మేం ఇది జోనోటిక్ (జంతువుల నుంచి మానవులకు) ట్రాన్స్ మిషన్ ..లేదా గబ్బిలాల నుంచి సోకిన వైరస్ అన్న వాదనలను కూడా పరిశీలించామని, బహుశా ల్యాబ్ లో ఈ వైరస్ కి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నప్పుడు మానవులకు కూడా (జెనెటిక్ పరంగా కాకుండా)  సంక్రమించడానికి అనువైన పధ్ధతిని ఎడాప్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోందని ఆయన చెప్పారు. అంటే అదివరకే ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకి ఉండవచ్ఛు అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

అసలు ఈ ఔట్ బ్రేక్ పై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలన్న డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో.. తాము ఇంకా లోతుగా ఈ వైరస్ కి సంబంధించిన అంశాలను పరిశోధించాల్సిన అవసరం ఉందని అలీనా చాన్ పేర్కొన్నారు.