దేశంలో కరోనా ఉద్ధృతి.. లక్ష దాటిన మరణాలు..

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 75,829 కేసులు, 940 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా ఉద్ధృతి.. లక్ష దాటిన మరణాలు..

Updated on: Oct 04, 2020 | 10:58 AM

Coronavirus Death Toll India: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 75,829 కేసులు, 940 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,373కి చేరుకుంది. ఇందులో 9,37,625 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,01,782 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అలాగే 55,09,966 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో 82,260 మంది కోలుకున్నారు. (ఏపీ: పాఠశాలలో పరేషాన్.. 20 మంది విద్యార్థులకు కరోనా..)

కాగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటగా, 37,758 మంది వైరస్ దాటికి ప్రాణాలు కోల్పోయారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు క్రమక్రమంగా పెరుగుతుండటం ప్రజలకు ఊరటను ఇస్తోంది. (ఏపీ: ఆ ఒక్క జిల్లాలోనే లక్షకు చేరువైన కేసులు..)

Loading...
Unable to load recommendations.
Follow Us