ఏపీ: పాఠశాలలో పరేషాన్.. 20 మంది విద్యార్థులకు కరోనా..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కలకలం రేగింది. గంట్యాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీ: పాఠశాలలో పరేషాన్.. 20 మంది విద్యార్థులకు కరోనా..
Follow us

|

Updated on: Oct 03, 2020 | 6:49 PM

Corona To Students: విజయనగరం జిల్లాలోని ఓ స్కూల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అందుకు కారణం 18 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకడం. అవును మీరు వింటున్నది నిజం. గంట్యాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా… ఆన్‌లైన్‌ క్లాసుల్లో అర్థంకాని విషయాలు తెలుసుకునేందుకు కొందరు విద్యార్థులు స్కూలుకు వచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు అదే కొంప ముంచింది. గతనెల 30న గంట్యాడ జెడ్‌పీ స్కూల్‌లో టీచర్లతోపాటు 9,10వ తరగతి విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 18 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారికి లెటర్‌ రాశారు ప్రధానోపాధ్యాయురాలు.

విద్యార్థులకు కరోనా రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులకు విద్యార్థులు హాజరుకావడం వల్లే కరోనా వ్యాప్తి జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే- ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులకు కరోనా టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్ధారణ అయిందని ప్రధానోపాధ్యాయురాలు చెబుతున్నారు. స్కూల్‌కి వచ్చిన తరువాత కరోనా సోకిందా? లేక లక్షణాలు కనిపించకుండా ఉన్న విద్యార్థులు కరోనాతో స్కూల్ కి వచ్చారా అనే అంశంపై వైద్య అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. స్కూల్ టీచర్స్‌కి మాత్రం కరోనా సోకలేదని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.

Also Read:

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!