ఏపీలో కొత్తగా 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు.. భారీగా పెరుగుతున్న రికవరీ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 551 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,72,839కి చేరింది.

ఏపీలో కొత్తగా 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు.. భారీగా పెరుగుతున్న రికవరీ కేసులు..
Corona Andhra Pradesh

Updated on: Dec 08, 2020 | 6:32 PM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 551 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,72,839కి చేరింది. ఇందులో 5429 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,57,473 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 4 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 7,042కు చేరుకుంది. ఇక నిన్న 744 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,05,09,805 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 8, చిత్తూరు 76, తూర్పుగోదావరి 57, గుంటూరు 89, కడప 18, కృష్ణా 108, కర్నూలు 3, నెల్లూరు 35, ప్రకాశం 18, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 36, విజయనగరం 11, పశ్చిమ గోదావరి 58 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us