వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 91 లక్షలు..

యావత్ మానవజాతిని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9,192,712 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 474,445 మంది  కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 4,939,382 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి […]

వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 91 లక్షలు..

Edited By:

Updated on: Jun 23, 2020 | 10:55 AM

యావత్ మానవజాతిని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9,192,712 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 474,445 మంది  కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 4,939,382 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 1,38,975 కేసులు, 3,880 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో కొంచెం ప్రజలకు అది ఊరటను ఇస్తోంది.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్,బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అయితే కొంతమేరకు సామూహిక వ్యాప్తి కూడా చెందుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(2,388,153), మరణాలు(122,610) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటగా.. 51 వేలు పైగా కరోనా మరణాలు సంభవించాయి. ఇక రష్యాలో 592,280 పాజిటివ్ కేసులు, 8,206 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 4,40,215 నమోదు కాగా, మృతుల సంఖ్య 14,011కి చేరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us