Sad news క్వారెంటైన్‌లో కటకటా..!

కాకినాడ జేఎన్టీయూ క్వారంటైన్ సెంటర్‌లో కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. క్వారంటైన్ సెంటర్‌లో పాడైపోయిన ఆహారం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Sad news క్వారెంటైన్‌లో కటకటా..!

Updated on: May 24, 2020 | 1:05 PM

Quarantined people agitating for good food in Kakinada’s JNTU: కాకినాడ జేఎన్టీయూ క్వారంటైన్ సెంటర్‌లో కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. క్వారంటైన్ సెంటర్‌లో పాడైపోయిన ఆహారం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్‌లో కనీస పారిశుద్ధ్య పనులు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్దేశించినట్లుగా తాము క్వారెంటైన్‌లో వుంటున్నామని, కానీ స్థానిక అధికారులు పాడైపోయిన ఆహారం పెడుతూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని క్వారెంటైన్‌లో వున్న కరోనా అనుమానితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను, తమను ఓకే క్వారంటైన్ సెంటర్‌లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఉదయం ఆందోళన చేశారు. అధికారులతోను, సిబ్బందితోను వాగ్వాదానికి దిగారు.

సుమారు రెండు వందల మందిని ఒకే క్వారంటైన్ సెంటర్‌లో పెట్టి కనీస మౌలిక వసతులు కల్పించలేదంటూ ఆగ్రహం చేస్తున్నారు. కాకినాడ జెఎన్టీయూ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచిన 200 మంది ఆందోళన చేయగా పరీక్షలు జరిపి నెగిటివ్ రావడంతో వారిని మామిడాడ స్వస్థలాలకు ఆర్టీసీ బస్సులో తరలించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.