కరోనా కలకలం.. మహానంది ఆలయం మూసివేత

మహానందిలో కరోనా కలకలం సృష్టించింది. 26 వరకు ఆలయం మూసివేస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు ప్రకటించారు. మహానంది దేవాలయంలోని ఉద్యోగులు గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో...

కరోనా కలకలం.. మహానంది ఆలయం మూసివేత

Updated on: Jul 21, 2020 | 6:38 AM

మహానందిలో కరోనా కలకలం సృష్టించింది. 26 వరకు ఆలయం మూసివేస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు ప్రకటించారు. మహానంది దేవాలయంలోని ఉద్యోగులు గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు వీరికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివ్ గా వచ్చిన ముగ్గురు ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆలయ ప్రాంగణాల్లో యాంటీ బ్యాక్టీరియా ద్రావణం పిచికారీచేయడమే కాకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి శుద్ధి చేస్తున్నారు.

ఇక మహానంది దేవాలయాలన్ని ఈ నెల 26 వ తేదీ వరకు మూసెయ్యాలని అధికారులు నిర్ణయించారు. అయితే, స్వామివారి నిత్య కైంకర్యాలను యధావిధిగా ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us