జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం

|

Jul 31, 2020 | 11:10 PM

Corona Epidemic in Metupalli Town : తెలంగాణలోని గ్రామీణ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మహబూబ్ నగర్ లో కొవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరగడంతో కంటోన్మెంట్ జోన్లు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలోని మెటుపల్లి పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓ కౌన్సిలర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య అధికారులు పట్టణంలో 30 మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. […]

జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం
Follow us on

Corona Epidemic in Metupalli Town : తెలంగాణలోని గ్రామీణ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మహబూబ్ నగర్ లో కొవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరగడంతో కంటోన్మెంట్ జోన్లు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలోని మెటుపల్లి పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

ఓ కౌన్సిలర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య అధికారులు పట్టణంలో 30 మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కొవిడ్-19 వైరస్  సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. కరోనా బాధితులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. పలువురిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాలను శానిటేషన్ చేస్తున్నారు.