ప్రపంచంలో 1.4 కోట్ల మందికి కరోనా.. 6 లక్షల మరణాలు..

Corona Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 14,272,800 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 601,062 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 8,522,788 ఈ వైరస్ […]

ప్రపంచంలో 1.4 కోట్ల మందికి కరోనా.. 6 లక్షల మరణాలు..

Updated on: Jul 18, 2020 | 10:18 PM

Corona Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 14,272,800 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 601,062 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 8,522,788 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 240,481 పాజిటివ్ కేసులు, 5,559 మరణాలు సంభవించాయి.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(3,794,132), మరణాలు(142,411) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 2,053,174 నమోదు కాగా, మృతుల సంఖ్య 78,097కు చేరింది. ఇక రష్యాలో 765,437 పాజిటివ్ కేసులు,12,247 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 1,055,932 నమోదు కాగా, మృతుల సంఖ్య 26,508కి చేరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us