దేశంలో కొత్తగా 32,080 పాజిటివ్ కేసులు, 385 మరణాలు.. పెరుగుతున్న రికవరీ రేటు..

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,080 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కు చేరింది.

దేశంలో కొత్తగా 32,080 పాజిటివ్ కేసులు, 385 మరణాలు.. పెరుగుతున్న రికవరీ రేటు..

Updated on: Dec 09, 2020 | 10:00 AM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,080 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,78,909 ఉండగా.. ఇప్పటివరకు 92,15,581 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 402 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,41,360 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 36.635 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 10,22,712 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 14,98,36,767కు చేరింది. దేశంలో 94.66 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.89 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.

Loading...
Unable to load recommendations.
Follow Us