ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,062 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 458 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.!
Corona Andhra Pradesh

Updated on: Dec 18, 2020 | 6:26 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,062 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 458 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. ఇందులో 4,377 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,66,359 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఒకరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7070కు చేరుకుంది. ఇక నిన్న 534 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,11,34,359 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 29, చిత్తూరు 98, తూర్పుగోదావరి 54, గుంటూరు 41, కడప 18, కృష్ణా 78, కర్నూలు 13, నెల్లూరు 26, ప్రకాశం 6, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 28, విజయనగరం 19, పశ్చిమ గోదావరి 35 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us