ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో 5,75,845 కేసులు, 8,802 మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో 5,75,845 కేసులు, 8,802 మరణాలు..

Updated on: Nov 15, 2020 | 7:29 PM

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 5,75,845 పాజిటివ్ కేసులు, 8,802 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,460,275కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,320,371 మంది కరోనాతో మరణించారు. ఇక 37,977,525 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 11,229,554కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 251,268 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 8,816,401 కేసులు నమోదు కాగా.. 129,696 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక యూరోప్‌లో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

Also Read: 

‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..

రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..

#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?

బాలుడి అదృశ్యంపై కలకలం.. కిడ్నాపర్ల బేరం..

Loading...
Unable to load recommendations.
Follow Us