మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. కొత్తగా 2,535 పాజిటివ్‌ కేసులు, 60 మరణాలు

మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వంద లోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. కొత్తగా 2,535 పాజిటివ్‌ కేసులు, 60 మరణాలు

Updated on: Nov 16, 2020 | 10:58 PM

Corona Cases : మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వంద లోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,535 పాజిటివ్‌ కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,49,777కు, మరణాల సంఖ్య 46,034కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 3,001 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 16,18,380కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 92.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,386 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Loading...
Unable to load recommendations.
Follow Us