రైతులు మీకు గాంధీ జయంతి వరకు గడువునిచ్చారు..ఇప్పటికైనా స్పందించండి.. రాహుల్ గాంధీ.

| Edited By: Pardhasaradhi Peri

Feb 07, 2021 | 12:13 PM

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు మోదీ ప్రభుత్వానికి అక్టోబరు 2..గాంధీ జయంతి వరకు గడువునిచ్చారని, మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి..

రైతులు మీకు గాంధీ జయంతి వరకు గడువునిచ్చారు..ఇప్పటికైనా స్పందించండి.. రాహుల్ గాంధీ.
Follow us on

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు మోదీ ప్రభుత్వానికి అక్టోబరు 2..గాంధీ జయంతి వరకు గడువునిచ్చారని, మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.  ఈ సర్కార్ తో ఇన్నాళ్లుగా చర్చలు జరిపినా  ప్రయోజనం లేదని వారు గ్రహించారని, అందువల్లే మరో 8 నెలల పాటు  కూడా నిరసనలు కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదన్నారు.

నిన్న చక్కా జామ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగని విషయాన్ని గ్రహించాలని  రాహుల్ కోరారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులే రెచ్ఛగొడుతున్నారని వార్తలు వస్తున్నాయన్నారు.మొండి వైఖరిని విడనాడి సత్యాగ్రహం చేస్తున్న అన్నదాతల న్యాయసమ్మతమైన డిమాండ్లను ప్రభుత్వం  మరోసారి పరిశీలించాలన్నారు. ఈ చట్టాలు కేవలం రైతులకే కాదు..మొత్తం దేశానికే ప్రమాదకరం అని ఆయన పేర్కొన్నారు. కాగా రైతుల ఆందోళనలను సమర్థిస్తూ ప్రముఖ విదేశీ సెలబ్రిటీలు కూడా ట్వీట్లు చేయడం విశేషం. అయితే దీనిపై భారత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది.

Read More:

చక్కా జామ్ సందర్భంగా ఖలిస్తానీ పతాకం కనబడిందా ? ఆరా తీస్తాం, రైతునేత రాకేష్ తికాయత్.

సీఏ చదివిన ఈ వ్యక్తి ఎంత క్రూరుడో.. భార్య పేరుతో భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి.. ఆపై తుదముట్టించాడు