ప్రకాశంజిల్లా వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారుల ఘర్షణల నడుమ నలిగిపోతోన్న 75 గ్రామాల ప్రజలు

|

Dec 16, 2020 | 1:38 PM

ప్రకాశంజిల్లా వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారుల ఘర్షణల నడుమ 75 గ్రామాల మత్స్యకారులు నలిగిపోతున్నారు. రెండు గ్రామాల మధ్య తాజాగా నెలకొన్న..

ప్రకాశంజిల్లా వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారుల ఘర్షణల నడుమ నలిగిపోతోన్న 75 గ్రామాల ప్రజలు
Follow us on

ప్రకాశంజిల్లా వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారుల ఘర్షణల నడుమ 75 గ్రామాల మత్స్యకారులు నలిగిపోతున్నారు. రెండు గ్రామాల మధ్య తాజాగా నెలకొన్న ఘర్షణలతో బల్ల వల, ఐలా వల వినియోగంపై అధికారులు నిషేధం విధించడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళలేక విలవిల్లాడుతున్నారు. రెండు గ్రామాలు ఆధిపత్య పోరుతో తమకు ఉపాధి కరువైందని వాపోతున్నారు. మూడేళ్లుగా ఈ విషయంలో వివాదం చెలరేగుతున్నా , అధికారులు పట్టించుకోకపోవడం వల్లే వివాదం పెరిగి పెద్దదయిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని, తమ జీవన విధానానికి ఆటంకం లేకుండా చూడాలని విజయలక్ష్మీపురం మత్స్యకారులు టీవీ9తో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నడిసంద్రాన సీనీ ఫక్కీలో ప్రకాశం జిల్లా మత్యకారుల బిగ్ ఫైట్.. బోట్ లు వేసుకుని పోటాపోటీ ఛేజింగులు, దాడులు