విభిన్న మతాల కలయికతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేద్దాం, ‘చేతులు జోడించి కోరుతున్నా’.. : కేసీఆర్

|

Nov 23, 2020 | 3:56 PM

విభిన్న మతాల కలయికతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందన్న ఆయన, ప్రపంచంలో ఎక్కడా లేని సంప్రదాయాలు హైదరాబాద్ లో ఉంటాయని చెప్పారు.

విభిన్న మతాల కలయికతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేద్దాం, చేతులు జోడించి కోరుతున్నా.. : కేసీఆర్
Follow us on

విభిన్న మతాల కలయికతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందన్న ఆయన, ప్రపంచంలో ఎక్కడా లేని సంప్రదాయాలు హైదరాబాద్ లో ఉంటాయని చెప్పారు. గొప్ప సంకృతి – సంప్రదాయం కలిగిన ఒక పూల బొకే లాంటి నగరం హైదరాబాద్ అని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో మంచినీటి కొట్లాటలు లేవు.. HMDA ప్రాంతానికి సైతం మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి…ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్-2 స్థానంలో హైదరాబాద్ ఉంది అని కేసీఆర్ తెలిపారు.

ధరణి- టీఎస్ బి-పాస్, టీఎస్ ఐ-పాస్ ప్రపంచ ఆదరణ పొందనున్నాయి.. విభిన్న మతాల కలయికతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చేద్దాం..హైదరాబాద్ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ చేయి కలపాలి.. రాబోయే కొన్ని రోజుల్లో ghmc కొత్త చట్టం తెస్తున్నాము అని కేసీఆర్ వెల్లడించారు. కాగా, కరోనా మహమ్మారి జడలువిప్పుతోన్న తరుణంలో సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది.. చేతులు జోడించి కోరుతున్నా.. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.