సోనియా గాంధీతో చంద్రబాబు భేటీ

|

May 19, 2019 | 5:18 PM

ఢిల్లీ: ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమిని ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక పార్టీల అగ్రనేతలతో భేటీ అయిన ఆయన.. తాజాగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో తొలిసారి భేటీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియనుండటంతో దేశంలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీయేతర పక్షాల కూటమికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ […]

సోనియా గాంధీతో చంద్రబాబు భేటీ
Follow us on

ఢిల్లీ: ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమిని ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక పార్టీల అగ్రనేతలతో భేటీ అయిన ఆయన.. తాజాగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో తొలిసారి భేటీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియనుండటంతో దేశంలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీయేతర పక్షాల కూటమికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు వివిధ పార్టీల అగ్రనేతలతో కలిసి సేకరించిన అభిప్రాయాలను సోనియాకు వివరించే అవకాశం ఉంది. అలాగే, ఎన్నికల ఫలితాల సరళి, భవిష్యత్తు కార్యాచరణపైనా కీలకంగా చర్చించనున్నారు.