
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ మానవ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. హర్యానాలోని రోహతక్‌లో పీజీఐ హాస్పిటల్‌లో కోవిడ్ రోగులకు కోవాక్సిన్ టీకాను వేసినట్లు హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ముగ్గురికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే కోవాక్సిన్ టీకా తీసుకున్న వారు క్షేమంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాలేదన్నారు. ఈ వ్యాక్సిన్ ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది.
[svt-event date=”17/07/2020,5:11PM” class=”svt-cd-green” ]
[/svt-event]