ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చిరంజీవి..!

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 8 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే అదే రోజున సోనియా గాంధీ ఆ నియోజకవర్గంలో సభ నిర్వహిస్తారని.. కాగా ఆ సభలో చిరు పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వేశ్వరరెడ్డి హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వెళ్లి తనకు సపోర్ట్ గా ప్రచారం చెయ్యమని కోరారు. మరోవైపు ఆయన […]

ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చిరంజీవి..!

Updated on: Apr 02, 2019 | 8:42 PM

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 8 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే అదే రోజున సోనియా గాంధీ ఆ నియోజకవర్గంలో సభ నిర్వహిస్తారని.. కాగా ఆ సభలో చిరు పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే విశ్వేశ్వరరెడ్డి హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వెళ్లి తనకు సపోర్ట్ గా ప్రచారం చెయ్యమని కోరారు. మరోవైపు ఆయన చిరు కోడలు ఉపాసన కు బంధువు కూడా కాబట్టి.. చిరంజీవి ఆయన అభ్యర్ధనకు ఓకే చెప్పారని సమాచారం. కాగా ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి.. కాస్త గ్యాప్ తీసుకుని ప్రచార సభల్లో పాల్గొంటాడా లేదా అనేది చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us