పందితో బంగీ జంప్.. చైనాలో థీమ్ పార్క్ నిర్వాకం..

చైనాలో ఓ థీమ్ పార్కు నిర్వాహకులు విచిత్రమైన, అమానుషమైన ప్రయోగానికి ఒడిగట్టారు. టూరిస్టులను ఆకర్షించేందుకు బంగీ జంప్ వంటి స్టంట్ ను మొదలుపెట్టే క్రమంలో.. ఒక పందిని 223 అడుగుల ఎత్తయిన టవర్ నుంచి కిందికి జార విడిచారు. మొదట ఈ వరాహాన్ని తాడుతో అన్ని వైపులా కట్టేసి.. ఈ టవర్ పైకి తెచ్చారు. అది ఏమాత్రం గింజుకోకుండా మళ్ళీ ఓ పోల్ కి మరిన్ని తాళ్లతో బంధించి.. కిందికి వదిలారు. మధ్య మధ్య తాడును, పోల్ […]

పందితో బంగీ జంప్.. చైనాలో థీమ్ పార్క్ నిర్వాకం..
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 21, 2020 | 4:39 PM

చైనాలో ఓ థీమ్ పార్కు నిర్వాహకులు విచిత్రమైన, అమానుషమైన ప్రయోగానికి ఒడిగట్టారు. టూరిస్టులను ఆకర్షించేందుకు బంగీ జంప్ వంటి స్టంట్ ను మొదలుపెట్టే క్రమంలో.. ఒక పందిని 223 అడుగుల ఎత్తయిన టవర్ నుంచి కిందికి జార విడిచారు. మొదట ఈ వరాహాన్ని తాడుతో అన్ని వైపులా కట్టేసి.. ఈ టవర్ పైకి తెచ్చారు. అది ఏమాత్రం గింజుకోకుండా మళ్ళీ ఓ పోల్ కి మరిన్ని తాళ్లతో బంధించి.. కిందికి వదిలారు. మధ్య మధ్య తాడును, పోల్ ను పైకి, కిందికీ లాగుతుంటే ఆ నోరులేని జీవి అల్లాడుతుండగా.. కింద ఉన్న జనమంతా చప్పట్లు కొడుతూ.. ‘ వినోదం’ చూశారు. అలా కొంతసేపు ఆ పందిని ‘ ఆట లాడించి’.. చివరకు పోల్ ని పైకి లాగేసరికి అప్పటికే అది స్పృహ తప్పి దాదాపు జీవచ్ఛవంలా మారింది. దాంతో ఆ వరాహాన్ని స్లాటర్ హౌస్ (కబేళా) కు తరలించారు. ఈ వీడియోను చూసిన అనేకమంది నెటిజన్లు, జంతు కారుణ్య సంఘాలవారు..నోరులేని జీవి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని ఆగ్రహిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో తామేదో పొరబాటు చేసినట్టు ఆ థీమ్ పార్క్ నిర్వాహకులు క్షమాపణ చెబుతూ చేతులు దులుపుకున్నారు.