గర్భిణీలకు వైద్యుల హెచ్చరిక.. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచన.. వీడియో

ఢిల్లీ NCR సహా అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

ఢిల్లీ NCR సహా అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా కాలుష్యం వల్ల చాలా ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, గర్భిణీలు తమను తాము చాలా జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వాయు కాలుష్యం కారణంగా కలుషిత రేణువులు పుట్టబోయే బిడ్డ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయని, తద్వారా, నెలలు నిండకుండానే పుట్టడం, ఆలస్యంగా పుట్టడం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. పుట్టిన తర్వాత పిల్లలు ఆస్తమాతో బాధపడవచ్చని సూచిస్తున్నారు. అందుకే గర్భిణీలు కాలుష్యానికి దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

Viral Video: ఎయిర్‌ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో

COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu