సుప్రీం జడ్జిల సంఖ్యను పెంచండి.. ప్రధానికి సీజేఐ లేఖ

| Edited By:

Jun 23, 2019 | 7:58 AM

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాల్సిందిగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే 58 వేల 669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. తాజాగా మరిన్ని కేసులు వచ్చి చేరుతుండటంతో ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని లేఖలో తెలిపారు. హైకోర్టుల్లో 399 మంది న్యాయమూర్తుల కొరత ఉందని, తక్షణమే వాటిని భర్తీ చేసేలా చర్యలు […]

సుప్రీం జడ్జిల సంఖ్యను పెంచండి.. ప్రధానికి సీజేఐ లేఖ
Follow us on

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాల్సిందిగా పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో ఇప్పటికే 58 వేల 669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. తాజాగా మరిన్ని కేసులు వచ్చి చేరుతుండటంతో ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని లేఖలో తెలిపారు. హైకోర్టుల్లో 399 మంది న్యాయమూర్తుల కొరత ఉందని, తక్షణమే వాటిని భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు.