అమ్మకానికి చెగువేరా చిన్నప్పటి ఇల్లు

మార్క్సిస్ట్ విప్లవకారుడు చేగువేరా బాల్యంలో నివసించిన ఇల్లును అమ్మకానికి పెట్టారు. అర్జెంటినా దేశంలోని రోసారియోలో చెగువేరా బాల్యాన్ని గడపగా..

అమ్మకానికి చెగువేరా చిన్నప్పటి ఇల్లు

Updated on: Jul 17, 2020 | 3:42 PM

మార్క్సిస్ట్ విప్లవకారుడు చేగువేరా బాల్యంలో నివసించిన ఇల్లును అమ్మకానికి పెట్టారు. అర్జెంటినా దేశంలోని రోసారియోలో చెగువేరా బాల్యాన్ని గడపగా.. 200 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఆ ఇంటిని 400,000 డాలర్లకు వేలానికి ఉంచారు. ఈ ఇంటికి దశాబ్దాలుగా చాలా మంది యజమానులు ఉంటూ వచ్చారు.

ఇక ప్రస్తుత యజమానుల్లో ఒకరైన ఫ్రాన్సిస్కో ఫర్రుగియా మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో తాను ఈ భవనాన్ని విక్రయించాలనుకుంటున్నానని అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు తన నిర్ణయాన్ని వేగవంతం చేశానని తెలిపారు. కాగా లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో అనేక విప్లవాలకు నాయకత్వం వహించిన చెగువేరాను.. 1967లో బొలీవియాలో బొలీవియన్ మిలటరీ ఉరి తీసిన విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us